Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

తార్నాక, అక్టోబర్ 8, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ( టీపీసీసీ ) అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ పిలుపు మేరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్‌ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రక్రియపై తమకు ఉన్న అభ్యంతరాలను పరిష్కరించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డీసీసీ ప్రసిడెంట్ దీపక్ జూన్, తెలంగాణ ఆర్టీఏ సభ్యుడు నేతికర్‌ సురేష్‌లాల్‌ పాల్గొని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు మద్దతు తెలిపారు. ఆయనతో పాటు కిట్టు, మల్లేష్‌ యాదవ్‌ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొని తమ డిమాండ్లను వినిపించారు. లోక్‌భవన్‌ వైపు కొనసాగిన ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page