...

అసమానతలను రూపుమాపడానికి అంబేద్క‌ర్ చేసిన కృషి గొప్ప‌ది – టిడిపి నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్, బాల్‌రాజ్‌గౌడ్‌

అసమానతలను రూపుమాపడానికి అంబేద్క‌ర్ చేసిన కృషి గొప్ప‌ది
– టిడిపి నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్, బాల్‌రాజ్‌గౌడ్‌

హైదరాబాద్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ :      స‌మాజంలోని అసమానతలను రూపుమాపడానికి అంబేద్క‌ర్ చేసిన కృషి గొప్ప‌దని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయ‌కులు న‌ల్లెల్ల కిషోర్, బాల్‌రాజ్‌గౌడ్ లు అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ జయంతి కార్యక్రమం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ దోమ‌లగూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు అంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… అణగారిన వర్గాలకు, హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాల‌ను కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేద్క‌ర్ అని అన్నారు. ఈ రోజు ఎంతో మంది ఆయన ఆదర్శాల గురించి వల్లిస్తున్నారే తప్పా ఆచరణలో చేసింది శూన్యమ‌ని విమ‌ర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యావంతులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి, ఆనాడు దివంగ‌త ఎన్‌టి రామారావు రాజకీయాల్లో అణగారిన వర్గాల యువతకు పెద్దపీట వేశారన్నారు. తద్వారా సమాజంలో ఒక నూతన విప్లవానికి నాంది పలికారని తెలిపారు. అంతే కాకుండా భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చూపిన చొరవ అసామాన్యమ‌న్నారు. స్వాతంత్య్ర భారతంలో తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్క‌ర్‌ ఉన్నారని పేర్కొన్నారు.

  ఆ రోజుల్లో డాక్ట‌ర్‌. కెఆర్.నారాయణన్ రాష్ట్రపతిగా నియామకం జరిగినప్పుడు జాతీయ స్థాయిలో అతి కీలకమైన పాత్రను పోషించింది తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన లోక్ సభ స్పీకర్ పదవికి దళితుడైన జిఎంసి బాలయోగిని, రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా దళిత మహిళ ప్రతిభా భారతిని ఎంపిక చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు కాసుల సుదర్శ‌న్‌, శ్యామ్ సుందర్, భాను ప్రకాష్, కరణం కిరణ్, పరుశురామ్, బి.రాజు, సత్యనారాయణ, సుక్రవేది, యాదగిరి, శక్తి ప్రేమ్, పాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.