అమెరికా, ఇజ్రాయెల్ లు తమ తీరు మార్చుకోవాలి
» బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్
హైదరాబాద్, మార్చి 2, అద్దం న్యూస్ : అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు విక్రమ్ గౌడ్ సోమవారం మాట్లాడుతూ… ఇప్పటికే దుబాయ్ ఎయిర్‌పోర్టులో వేలాదిమంది చిక్కుకుపోయినట్లు సమాచారం ఉండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. భారతదేశానికి చెందిన లక్షలాది కార్మికులు దుబాయ్, అబుదాబి, కువైట్ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే శాంతి చర్చలకు పిలుపునివ్వాలని ఆయన కోరారు. అమెరికా–ఇజ్రాయెల్‌ను కాకుండా అబుదాబి, యూఏఈ పై దాడులు చేయడం అసాంఘిక చర్యలని ఆయన తీవ్రంగా ఖండించారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.![]()

![]()












Leave a Reply