పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

 

 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

 

సైదాపూర్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ :   సైదాపూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 86 –87 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు 39 సంవత్సరాల తర్వాత ఒక చోట కలుసుకొని ఒకరికొకరు యోగ క్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల విద్యా బోధనలను గుర్తుచేసుకొని వారిని కొనియాడారు. ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అప్పటి ఉపాధ్యాయులు కొత్త మల్లారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, తిరుపతయ్య, పూర్వ విద్యార్థులు చాడ వెంకట్‌రెడ్డి, కాయిత రాములు, చందా రమేష్, లక్కాకుల ప్రవీణ్ కుమార్, జి ప్రసాద్, మాడెపు రమేష్, లక్ష్మణ్, వర్ధరాజు, రవి, తిరుపతయ్య, సుధాకర్, జగన్నాథ రెడ్డి, సదయ్య, తిరుమల, మంజుల, శ్రీదేవి, కళావతి, నీరజ, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page