తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అన్నదానం
హైదరాబాద్, మార్చి 11, అద్దం న్యూస్ : అయ్యప్ప గురుస్వామి తలారి సుశీలమ్మ ముదిరాజ్ 2 వ వర్ధంతి సందర్భంగా ఆమె కొడుకు, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ముషీరాబాద్ రెయిన్‌బో హోంలో నిరాశ్రయ బాలికలకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై శ్రీకాంత్ ముదిరాజ్‌తో కలిసి బాలికలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… సుశీలమ్మ సేవలు మర్చిపోలేనివని, ఆమెని యువకులు స్ఫూర్తిగా తీసుకొని సేవా మార్గలో రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎయిర్‌టెల్ రాజు, పట్నం నరేష్ ముదిరాజ్, శ్రీనివాస్, వంగల నర్సింగ్ రావు, అశోక్‌కుమార్, సత్యనారాయణ బాబు, పాకాల శ్రీకాంత్ యాదవ్, టిల్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply