శాంతియుత ర్యాలీలో పాల్గొన్న‌ వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

శాంతియుత ర్యాలీలో పాల్గొన్న‌ వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

హైదరాబాద్, జ‌న‌వ‌రి 17, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో శ‌నివారం శాంతియుత‌ ర్యాలీ నిర్వహిస్తుంటే అడ్డుకొని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సికింద్రాబాద్ బచావో పేరిట శాంతియుత నిర్వహించిన ర్యాలీకి బయలుదేరిన బిఆర్ఎస్ యువ నాయకుడు జయసింహతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం వారిని అంబ‌ర్‌పేట్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వంగా పాలను కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఇందిరమ్మ పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ఈ పాలనలో శాంతియుతంగా ర్యాలీని నిర్వ‌హించే అవకాశం కూడా లేదా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు డివిజ‌న్ల అధ్య‌క్షులు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, శంక‌ర్‌, రాకేష్‌, శ్యామ్‌, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ప‌లు డివిజ‌న్ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఆకుల అరుణ్‌కుమార్‌, పోతుల శ్రీకాంత్‌, దామోద‌ర్‌, బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు మేడి స‌త్య‌నారాయ‌ణ‌, జ‌స్వంత్‌, దీన్‌ద‌యాల్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కేశవపురం అరుణ్, ముదిగొండ మురళి, ఇంద్రసేనారెడ్డి, వల్లాల‌ రవి, బిక్షపతి, శీను, తదితరులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page