అశోక్‌నగర్, ఎస్‌బిహెచ్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం
– గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 05, అద్దం న్యూస్ : అశోక్‌నగర్, ఎస్‌బిహెచ్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్, ఎస్‌బిహెచ్ కాలనీలో మంగళవారం స్థానికులు, బిజెపి నాయకులతో కలిసి కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు కార్పొరేటర్ పావనికి వినతి పత్రాన్ని అందచేశారు. కాలనీలో వెలగని స్ట్రీట్ లైట్స్, గతుకుల, గుంతలతో ఇబ్బందికరంగా మారిన కాలనీ రోడ్లు, ఎస్‌బిహెచ్ పార్క్ 3 ను అభివృద్ధి పరిచి కాలనీవాసుల కొరకు ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ పావనికి కాలనీవాసులు వినతి పత్రాన్ని అందచేశారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ…స్ట్రీట్ లైట్స్, కాలనీలో నూతన సిసి రోడ్డు ఏర్పాటు, స్థానికుల అభ్యర్థన మేరకు ఎస్‌బిహెచ్ పార్క్-3లో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు సంబంధిత అధికారులతో సమీక్షించి వెంటనే అభివృద్ధి పనులపై ప్రత్యేక చర్యలు చేపడుతామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్, ఉపాధ్యక్షుడు శివకుమార్, కాలనీ అధ్యక్షుడు ధనుంజయ, ఎం.సూర్యనారాయణ, మనోహర్, ఎన్వై.కంటి, కిషోర్, రమేష్, కాంప్లే, విశ్వనాథ్, వెంకటేశ్, ఐవిఎస్ రెడ్డి, రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply