ఇంటికి కొత్త కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ లైన్‌మెన్ – లంచం తీసుకుంటుండ‌గా మ‌ధ్య‌వ‌ర్తిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఏసిబి అధికారులు

 

ఇంటికి కొత్త కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ లైన్‌మెన్

రూ.50 వేలు ఇవ్వ‌న‌న్న ఇంటి ఓన‌రు
రూ.30 వేల‌కు బేరం కుదుర్చుకున్న అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మ‌ల్లేష్‌
లంచం తీసుకుంటుండ‌గా మ‌ధ్య‌వ‌ర్తిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఏసిబి అధికారులు
– ప‌రారీలో అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మ‌ల్లేష్‌

హైదరాబాద్, మే 8, అద్దం న్యూస్ :    ఇంటికి క‌రెంట్ క‌నెక్ష‌న్ కోసం రూ.30 వేల లంచం తీసుకుంటుండ‌గా మ‌ధ్య‌వ‌ర్తిని ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఘ‌ట‌న అంబ‌ర్‌పేట‌లో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్లితే… అంబ‌ర్‌పేట‌కు చెందిన ఓ ఆటో డ్రైవ‌ర్ త‌న ఇంటి పాత మీట‌ర్ ప‌ని చేయ‌క‌పోవ‌డంతో కొత్త క‌రెంట్ క‌నెక్ష‌న్ కోసం ద‌రఖాస్తు చేయ‌గా కొత్త మీటర్ బిగించడానికి అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మ‌ల్లేష్ రూ.50 వేల రూపాయ‌ల లంచం డిమాండ్ చేశాడు. తాను ఆటో డ్రైవర్‌ను అంటూ.. రూ.50 వేలు లంచం ఇవ్వలేనని ఇంటి యజమాని మొరపెట్టుకున్నాడు. దీంతో అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మ‌ల్లేష్ స‌ద‌రు ఇంటి ఓన‌రుతో రూ.30 వేల రూపాయ‌ల‌కు బేరం కుదుర్చుకున్నాడు. స‌ద‌రు ఇంటి ఓన‌రు ఏసీబి అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. ఏసీబి అధికారుల సూచ‌న మేర‌కు రూ.30 వేల రూపాయ‌లు ఇస్తాన‌ని ఇంటి ఓన‌రు ఒప్పుకున్నాడు. ప‌థ‌కం ప్ర‌కారం గురువారం సాయంత్రం అలీ కేఫ్ చౌర‌స్తాలోని ఓ హోట‌ల్‌లో మ‌ధ్య‌వ‌ర్తి పి.సంతోష్‌కు డ‌బ్బులు ఇవ్వ‌మ‌ని యాజ‌మానికి చెప్పిన అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మ‌ల్లేష్ బ‌య‌ట నిల్చున్నాడు. రూ.30 వేల న‌గ‌దును మ‌ధ్య‌వ‌ర్తికి సంతోష్‌కు ఇస్తుండ‌గా ఏసీబి అధికారులు ఎంట‌రై రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఇది గమనించిన అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మల్లేష్ అక్కడి నుండి ప‌రార‌య్యాడు. ఏసీబీ అధికారులు శివ మ‌ల్లేష్ ప‌ని చేస్తున్న విద్యుత్ కార్యాలయానికి వెళ్లి పలు వస్తువులను స్వాధీనం చేసుకొని, మధ్యవర్తిని అరెస్టు చేశారు. అసిస్టెంట్ లైన్‌మెన్ శివ మల్లేష్ కోసం గాలింపు చర్యలు చేప‌ట్టారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page