భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కమిటీ సభ్యులను సన్మానించిన బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, ఆగస్టు 08, అద్దం న్యూస్ : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు శుక్రవారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్ రామ్‌నగర్‌లోని ఆయన నివాసంలో కలిశారు. సెప్టెంబర్ 6 న భాగ్యనగర్‌లో జరిగే సామూహిక గణేష్ నిమజ్జనానికి పాల్గొనమని దత్తాత్రేయను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కొత్తగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి రవినూతల శశిధర్‌ను సత్కరించారు. ఉపాధ్యక్షుడు కరోడిమల్ అగర్వాల్, కార్యదర్శి ఆలే భాస్కర్, బద్దం మహిపాల్ రెడ్డి, నైని బుచ్చి రెడ్డి, జి.ఆనంద్ గౌడ్, మాజీ కార్పొరేటర్ వైకుంఠం, శ్రీరామ్ వ్యాస్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply