బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా బండారు విజ‌య‌ల‌క్ష్మీ నియామకం

బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా బండారు విజ‌య‌ల‌క్ష్మీ నియామకం

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 08, అద్దం న్యూస్ :        భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బండారు విజ‌య‌ల‌క్ష్మీ నియమితులయ్యారు. ఆమె నియమాకాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. బండారు విజ‌య‌ల‌క్ష్మీ గతంలో బిజెపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా ప‌ని చేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఆమె రాంన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో మాట్లాడుతూ… పార్టీ పటిష్టత కోసం అంకితభవంతో అందిస్తున్న సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి కల్పించిన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆమె చెప్పారు. పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే సామాన్య కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కలిగిస్తుందని చెప్పడానికి తాను ఒక నిదర్శనమని అని చెప్పారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page