సైబ‌ర్ నేరాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి – చిల‌క‌ల‌గూడ ఏసిపి శ‌శాంక్‌రెడ్డి

సైబ‌ర్ నేరాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి
– చిల‌క‌ల‌గూడ ఏసిపి శ‌శాంక్‌రెడ్డి

చిల‌క‌ల‌గూడ‌, ఏప్రిల్ 7, అద్దం న్యూస్ :      సైబ‌ర్ నేరాల‌తో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలని – చిల‌క‌ల‌గూడ ఏసిపి కె.శ‌శాంక్‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం వారసిగూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మ‌ధురాన‌గ‌ర్ కాల‌నీలో సైబ‌ర్ నేరాల పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వార‌సిగూడ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేంద‌ర్ గౌడ్ నేతృత్వంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఏసిపి శ‌శాంక్ రెడ్డి హాజ‌రై ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు. సైబ‌ర్ నేర‌గాళ్లు మ‌భ్య‌పెట్టి డ‌బ్బులు కాజేస్తార‌న్నారు. ర‌క‌ర‌కాల లింక్‌ల‌ను పంపి సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఆ నేరాల‌తో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. సైబ‌ర్ నేరాల‌కు ఎవ‌రైనా గురైతే వెంట‌నే 1930 నంబ‌ర్‌కు డ‌య‌ల్ చేసి ఫిర్యాదు చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వార‌సిగూడ పోలీస్ సిబ్బంది, స్థానిక నాయ‌కులు మేక‌ల సారంగ‌పాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page