...

భోల‌క్‌పూర్ శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం రెనోవేష‌న్ క‌మిటీ ప్ర‌మాణ‌స్వీకారం

హైదరాబాద్, జూన్ 9, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం రెనోవేష‌న్ క‌మిటీ ప్ర‌మాణ‌స్వీకారం సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా సురేష్‌, స‌భ్యులుగా ఎం.శ్వేత‌, బి.న‌ర్సింగ్‌రావు, జి.సాయిబాబా, పి.నీల్‌చంద‌ర్, సూర్య చంద్ర‌శేఖ‌ర్‌, టి.క్రాంతి, కె.ప‌ర‌మేష్‌, పి.ల‌క్ష్మ‌ణ్‌, వైపి.రాజు, ఎం.రాజు, మహేష్ కుమార్, నర్సింగ్ రావు, సురేందర్, కిషోర్, రంజిత్ గౌడ్ లు నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఈవో బి.జ్యోతి, దేవాదాయ శాఖ అధికారి ల‌క్ష్మారెడ్డి లు రెనోవేష‌న్ క‌మిటీ స‌భ్యుల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆల‌య రెనోవేష‌న్ క‌మిటీ స‌భ్యుల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… భ‌వాని శంక‌ర దేవాల‌యం అభివృద్ధి కోసం రెనోవేష‌న్ క‌మిటీ సభ్యులు కృషి చేయాల‌న్నారు. దేవాల‌యాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వం పాటుప‌డుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్, కాంగ్రెస్ పార్టీ ఎ, బి బ్లాక్ అధ్య‌క్షులు అంజి యాద‌వ్‌, విడి.కృష్ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.