తెలంగాణ‌ ఉద్యమకారులపై పెట్టిన కేసులను భేష‌ర‌తుగా కొట్టివేయాలి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి

తెలంగాణ‌ ఉద్యమకారులపై పెట్టిన కేసులను భేష‌ర‌తుగా కొట్టివేయాలి
– తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి

హైదరాబాద్, ఆగ‌స్టు 08, అద్దం న్యూస్ :    తెలంగాణ‌ ఉద్యమకారులపై పెట్టిన కేసులను భేష‌ర‌తుగా కొట్టివేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం హైదరాబాద్ చిక్కడపల్లిలో గల తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెపు చంద్రన్న ప్రసాద్ నిర్వహణలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రతినిధులు, అడహక్ కమిటీ కన్వీనర్లు, కో–కన్వీనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధుల ఆమోదంతో టియు జేఏసి అన్ని జిల్లాల్లో విస్తరించేందుకు జిల్లా కమిటీలు వేయాలని స‌మావేశంలో తీర్మానించారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఆర్థికంగా మానసిక క్షోభ‌కు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఉద్యమకారులపై పెట్టిన కేసులను భేష‌ర‌తుగా కొట్టివేయాలని, నియామ‌కాల‌ కోసం వచ్చిన తెలంగాణ ఉద్యమం నిరుద్యోగంతో ఉద్యోగాలు రాక, ప్రైవేట్ సెక్టార్లన్నీ ఆంధ్ర వారివి కావడంతో తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రభుత్వ పరంగా ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థ, పొరుగు సేవల్లో ఆంధ్ర వాళ్ళ ప్రాతినిధ్యం పెరగడంతో తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఆ పొరుగు సేవా ఉద్యోగాలు కరువయ్యాయన్నారు. తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాల నుండి నిరుద్యోగం ఐదు రెట్లు పెరిగిందని, ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులు మానసికంగా కృంగిపోతున్నారని అన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ మాజీ చైర్మన్ వెంకట మల్లయ్య మాట్లాడుతూ… గత కేసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ కోసం ఉద్యమిచ్చిన ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం కొరకు ప్రాణాల‌ర్పించిన వారికి తీరని అన్యాయం జరిగిందన్నారు. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకాలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించే విధంగా కార్యచరణ తయారు చేసుకొని ఉద్యమించాలని అన్నారు. హై కోర్ట్ అడ్వకేట్ కొంగల ప్రజ్ఞాత్ కుమార్ మాట్లాడుతూ… ఉద్యమకారులకు నిర్మాణం, నాయకత్వం లక్షణాల గురించి వివరించారు.‌ఈ కార్యక్రమంలో 1969 తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం అనుభవించిన ఎం.శంకర్‌రావు, జేఏసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ గౌడ్, కొంపల్లి సాయిలు, ఒగిరాల సుజి, అంజలి కుమారి, రాష్ట్ర కార్యదర్శి బి.లావణ్య, బాలలక్ష్మి, స్వరూప రాణి, లలితమ్మ, సుచరిత, శ్రీనివాస్, రాములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వేముల యాదగిరి, కొయ్యడ రాజేష్, కర్న‌య్య‌, ఎం.విష్ణు, ఎం.వెంకటయ్య లు ఆలపించిన ఉద్యమ గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page