జనగణన పకడ్బందీగా చేపట్టాలి
• క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిఫ్లెక్ట్ కావాలి
• ప్రణాళికలు, పాలసీల రూపకల్పనకు క్వాలిటీ సెన్సెస్ డేటా ముఖ్య పాత్ర పోషిస్తుంది
» రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి
జనగణనలో ఒక్క హౌస్ హోల్డ్ మిస్ కావొద్దు
» ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి.కర్ణన్
హైదరాబాద్ బ్యూరో, మార్చి 11, అద్దం న్యూస్ : జనాభా గణన-2027 లో ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిఫ్లెక్ట్ కావాలన్నారు. క్వాలిటీ డేటా వల్ల అభివృద్ధి ప్రణాళికలు, పాలసీల రూపకల్పనకు, ప్రజాస్వామ్యం బలోపేతానికి క్వాలిటీ సెన్సెస్ డేటా ఎంతో దోహదం చేస్తుందని ఆమె తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోనీ సెన్సెస్–2027 సర్వే పై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు ఫేజ్ 1 : హౌజ్ లిస్టింగ్, హౌజింగ్ సెన్సెస్ ( HLO ) పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి ప్రారంభించి మాట్లాడారు. సెన్సెస్ -2027 సర్వే రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ మరియు గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందన్నారు. మొదటి దశ పగడ్బందీగా నిర్వహిస్తే రెండో విడత సజావుగా జరుగుతుందన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రణాళికలు, పాలసీల రూపకల్పనలో క్వాలిటీ సెన్సెస్ డేటా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. అంతటి ప్రాముఖ్యత గల సెన్సస్ కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో గుణాత్మకంగా నిర్వహించాలన్నారు. ఇందు కోసం సెన్సెస్ పై ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లు, అదనపు ఛార్జీ సెన్సెస్ ఆఫీసర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. అప్పుడే టీమ్‌కు సర్వే సరిగ్గా జరిగేలా మార్గదర్శనం చేయగలుగుతారని చెప్పారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, క్షేత్ర సిబ్బందికి గైడ్ చేయగలుగుతారన్నారు. క్షేత్రస్థాయిలో ఏం తప్పిదాలు చేసేందుకు అవకాశం ఉందో వాటిని గుర్తించి తప్పులు జరగకుండా కాకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. సర్వేలో సాంకేతికకు ప్రాధాన్యమిస్తున్న దృష్ట్యా డిజిటల్ టూల్స్ పై అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. స్పష్టతతో సర్వే చేపట్టేందుకు వీలుగా ప్రాక్టికల్ ట్రైనింగ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సెన్సెస్‌ను సీరియస్‌గా తీసుకుని టీమ్ వర్క్‌గా పనిచేస్తూ తెలంగాణ అవతరించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సెన్సెస్–2027 ను విజయవంతం చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపాలని సూచించారు.

ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి.కర్ణన్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టనున్న జనగణనలో కుటుంబాల వాస్తవ స్థితిగతులను ప్రతిబింబించాలన్నారు. తమ పరిధిలోని ఎన్యుమరేషన్ బ్లాక్‌లో ఒక్క హౌస్ హోల్డ్ కూడా మిస్ అవ్వద్దు అన్నారు. నాణ్యమైన సమగ్ర డేటాను సేకరించాలన్నారు. మొదటి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ లెక్కలు (హెచ్ఎల్వో) లో భాగంగా ఇంటి పరిస్థితులు, ఇంట్లోని సౌకర్యాలకు సంబంధించిన సమాచార సేకరణ జరుగుతుందన్నారు. రెండో దశలో దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక, ఆర్థిక వివరాలు నమోదు పక్కగా చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ చంద్రకళ, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. ![]()













Leave a Reply