ప్ర‌హ‌రిగోడ విష‌యంలో ఇరువ‌ర్గాల గొడ‌వ‌ – బాపూన‌గ‌ర్‌లో ఉద్రిక్త‌త – మోహ‌రించిన పోలీసులు

ప్ర‌హ‌రిగోడ విష‌యంలో ఇరువ‌ర్గాల గొడ‌వ‌

బాపూన‌గ‌ర్‌లో ఉద్రిక్త‌త – మోహ‌రించిన పోలీసులు

 

హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ చిక్క‌డ‌ప‌ల్లి బాపూన‌గ‌ర్ బ‌స్తీలో ప్రహరీ గోడ విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. చిక్కడపల్లిలో నివాసం ఉంటున్న మల్లేష్ తన ఇంటికి అనుకోని ఉన్న స్థలంలో గోడ నిర్మాణం చేపట్టారు. అయితే వెనుక భాగంలో నివాసం ఉండే శ్రీనివాస్ తమకు వెళ్లేందుకు మార్గం లేదంటూ ఆ గోడను కూల్చివేయడంతో శ‌నివారం గొడవ చోటుచేసుకుంది. దీంతో చిక్క‌డ‌ప‌ల్లి సిఐ రాజు నాయ‌క్ నేతృత్వంలో ఎస్ఐ లు, పోలీసు సిబ్బంది మోహ‌రించారు. విష‌యం తెలుసుకున్న గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఏసిపి యాద‌గిరి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌ల్లేష్ కుటుంబ‌స‌భ్యుల‌కు, సిఐ రాజు నాయ‌క్ కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. శ్రీనివాస్ అనే వ్య‌క్తి మా పై దాడి చేస్తే మీరు ఎందుకు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని సిఐ ను నిల‌దీశారు. ఏసిపి యాద‌గిరి స్థ‌లాన్ని చూసి జిహెచ్ఎంసి అధికారుల‌తో మాట్లాడుతామ‌ని చెప్పారు.

                    ఇదిలా ఉండ‌గా ఆ ఖాళీ స్థలం తమదే అని మల్లేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని సిటీ సివిల్ కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని మ‌ల్లేష్ తెలిపారు. తమ స్థలంలో గోడను నిర్మిస్తే కావాలని దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి, తనపై చిక్కడపల్లి పోలీసులు దౌర్జనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రీనివాస్ అనే వ్య‌క్తి త‌మ కుటుంబ‌స‌భ్యుల పై రౌడీల‌తో దాడి చేయించార‌ని, త‌న కొడుకు, కూతురు కాళ్లు, చేతులు విరగ్గొట్టిన పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న తమ కుటుంబాన్ని కావాలని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. న్యాయస్థానంలో కేసు ఉందని , అక్కడ ఎలాంటి తీర్పు వచ్చిన స్వాగతిస్తామని మల్లేష్ తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page