సీఎంకు పాల‌న అనుభ‌వం లేక నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

సీఎంకు పాల‌న అనుభ‌వం లేక నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఆగ‌స్టు 02, అద్దం న్యూస్ :     ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నిర్ణయాలు తీసుకోలేక పోవడం, పాలన విషయంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమగుతూ, ఆ నైరాశ నిస్సృహలలో జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. ప్రజలకు పత్రికలకు మధ్య సమన్వయంతో వారధిలా జర్నలిస్టులు వ్యవహరిస్తారని, వారి పైన నోరు పారేసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… య‌ధా రాజా తధా ప్రజా అనే విధంగా ముఖ్యమంత్రి పాలనలో కాంగ్రెస్ నాయకుల తీరు అడుగడుగుల జర్నలిస్టులకు అవమానాలు, జర్నలిస్టుల పైన పారేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడ తీయడమేనని, ఈ విధంగా అహంకార పూరితంగా మాట్లాడిన ఏ నాయకుడు చరిత్రలో మిగిలింది లేదన్నారు. తన గురించి గొప్పగా రాస్తే గౌరవించడం, తనకు నచ్చిన వార్తలు రాస్తే సంబరపడి మెచ్చు కోవడం తమ లోపాలు ఎత్తి చూపితే నోరు పారేసుకోవడం ఈ విధానం మానుకోవాలని అన్నారు. హిట్లర్, ఇందిరాగాంధీ లాంటి ఎందరో మహా మహులే కొట్టుకుపోయారని అన్నారు. నాయకులు జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం హేయమైన చర్య అని అన్నారు. వెంటనే పత్రికల వారికి భేషరతుగా క్షమా బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఎవరికి వారే గొప్ప… ఎవరి ఇంటికి వారే మహారాజు.. మీరు ముఖ్యమంత్రి అని చెప్పి స్వతంత్రంగా వ్యక్తిత్వము ఉండే జర్నలిస్టులు మీ వద్ద నౌకర్లు కారని గుర్తు చేశారు. ఒక జర్నలిస్టు వ్యవహారం నచ్చకపోతే పూర్తి జర్నలిస్టుల సమాజాన్ని కించపరచడం తగదని, ఆ విధంగా ప్రవర్తించిన వ్యక్తిని వేరుగా పిలిచి సలహా ఇవ్వడం ఒక పద్ధతి అని అన్నారు. అంతేగాని అందరిపై బాహాటంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కడు జర్నలిస్టు అని పేరు పెట్టుకుని ఆ వృత్తిని అడ్డం పెట్టుకుని దబాయిస్తున్నారని అని నోరు పారేసుకోవడం విచారకరం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే భేషరతుగా జర్నలిస్టు లందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, భానుప్రకాష్, కిరణ్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page