...

స్వీయ గణన లో వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

స్వీయ గణన లో వివరాలను నమోదు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :  జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ( స్వీయ గణన ) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో భాగంగా తెలంగాణలో ఆదివారం నుంచి ఆన్‌లైన్‌లో స్వీయ గణన ప్రారంభమైంది. వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి వివరాలను స్వీయ నమోదు చేసుకున్నారు. అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో ప్రజలంతా విశేషంగా పాల్గొనాలని వివరాలను నమోదు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. జనాభా లెక్కల కార్యక్రమంలో ముందుగా చేపట్టిన సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమానికి సంబంధించి సెన్సస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ సీహెచ్. ప్రియాంక తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.