బిర్యానీలో బొద్దింక‌ – ఒక‌రికి అస్వ‌స్థ‌త‌

 బిర్యానీలో బొద్దింక‌ 

  – ఒక‌రికి అస్వ‌స్థ‌త‌

 ఇదేంట‌ని ప్ర‌శ్నిస్తే నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇచ్చిన హోట‌ల్ యాజ‌మాన్యం

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 09, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్‌లోని ప‌లు బిర్యానీ హోట‌ళ్ల‌ల్లో, మండి బిర్యానీ హోట‌ళ్ల‌ల్లో బ‌ల్లి, బొద్దింక లు స‌ర్వ సాధార‌ణంగా మారిపోయింది. ఇష్ట‌మైన బిర్యానీ తినేందుకు వ‌చ్చే వినియోగ‌దారుల ఆరోగ్యాల‌తో కొన్ని హోట‌ళ్ల నిర్వాహ‌కులు చెల‌గాట‌మాడుతున్నారు. తాజాగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గోల్కొండ క్రాస్ రోడ్‌కు ద‌గ్గ‌ర్లో గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన గల అల్ సోద్ బైత్ ఆల్ మండి బిర్యానీలో బొద్దింక వ‌చ్చింది. సికింద్రాబాద్‌కు చెందిన సంతోష్‌, రాఘ‌వ‌, ప్ర‌శాంత్ అనే ముగ్గురు యువకులు మంగ‌ళ‌వారం రాత్రి డ్యూటీ ముగించుకొని మండి బిర్యాని తినేందుకు అల్ సోద్ బైత్ ఆల్ మండి హోట‌ల్‌కు వ‌చ్చారు. చికెన్ బిర్యానీ ఆర్డ‌ర్ ఇచ్చారు. బిర్యానీ తింటుండగా మధ్యలో ఒక బొద్దింక దర్శనం ఇవ్వడంతో షాక్కు గురై ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని బాధితులు వాపోయారు. బిర్యాని తిన్న వారిలో ఒక‌రు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతారా .. ఇలా బొద్దింక‌లు వ‌స్తే ఎలా.. మేం బ‌త‌కాలా… చావాల అని యువ‌కులు హోట‌ల్ యాజ‌మాన్యాన్ని నిల‌దీశారు. హోట‌ల్ యాజ‌మాన్యం మాత్రం అందులో ఏముంది.. అంద‌రూ తింటున్నారు క‌దా నిర్ల‌క్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితులు ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకుని హోట‌ల్ యాజ‌మాన్యం పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్ఐ.న‌స్రీన్ తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page