కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌యోజ‌న ప‌థ‌కాలు అమ‌లు కావ‌డంలేదు – ఆర్‌టిఐ యాక్ట్ ద్వారా తేట‌తెల్ల‌మైంది – ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్‌

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌యోజ‌న ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేదని, గ‌త ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలే కొన‌సాగుతున్నాయని ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు సిరిగిరి శ్యామ్ అన్నారు. ఆదివారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌యోజ‌న ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయా లేదా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు చేయూత ప‌థ‌కం రూ.4 వేల అందుతున్నాయా ?..మ‌హాల‌క్ష్మీ ప‌థకం కింద రూ.2500 అందుతున్నాయా లేదా ?.. క‌ళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కం కింద ఒక తులం బంగారం ఇస్తున్నారా లేదా ? అని ఆర్‌టిఐ యాక్ట్ -2005 ద్వారా ముషీరాబాద్ మండ‌ల కార్యాల‌యం పౌర స‌మాచార అధికారిని లిఖిత‌పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నాన‌న్నారు. దానికి స‌మాధానం వ‌చ్చింద‌న్నారు. పైన కోరిన ఏ ప‌థ‌కంలో కూడా ఒక్క ప‌థ‌కం కూడా అధికారికంగా అమ‌లు కాలేదని, గ‌త ప్ర‌బుత్వ ప‌థ‌కాలే ఇప్ప‌టికి కొన‌సాగుతున్నాయ‌ని అధికారికంగా ముషీరాబాద్ మండ‌ల కార్యాల‌యం పౌర‌ సమాచార‌ అధికారి ధృవీక‌రించార‌న్నారు. అమ‌లు కాల‌నీ ప‌త‌కాల ఆశ చూపి మాయ‌మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ ఎన్నిక‌ల్లో ఓట్ల ద్వారా త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్పాల‌న్నారు.


ఆర్‌టిఐ యాక్ట్ ద్వారా వివ‌ర‌ణ కోర‌గా ముషీరాబాద్ మండ‌ల కార్యాల‌యం పౌర స‌మాచార అధికారి నుంచి స‌మాధానం లేఖ‌ 


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page