
షెడ్డు నిర్మాణానికి విరాళం అందచేసిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
హైదరాబాద్, ఆగస్టు 20, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం ఆర్టీసి క్రాస్ రోడ్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆవరణలో నిర్మించనున్న షెడ్డు నిర్మాణానికి గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ తమ వంతు సహాయంగా 51 వేల రూపాయల విరాళాన్ని అందచేశారు. బుధవారం ఆలయ ఈవో లక్ష్మారెడ్డికి రూ.51 వేల రూపాయలను అందచేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… దేవాలయాల అభివృద్ధి, పరిరక్షణ మనందరి బాధ్యతగా, దేవాలయ సందర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన నూతన షెడ్డు కొరకు తాము విరాళాన్ని అందచేస్తున్నామని కార్పొరేటర్ పావని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించి మన సనాతన ధర్మ పరీరక్షణకు పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఆలయ రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ మారిశెట్టి నర్సింగ్‌రావు, బీజేపీ సీనియర్ నాయకులు పి.నర్సింగ్ రావు, ప్రకాష్ యాదవ్, జ్ఞానేశ్వర్, కమిటీ సభ్యులు జి.సురేందర్, డి.భాను, ఎం.శ్రీనివాస్, నవీన్ బండారి, అర్చకులు గోపి, రమణ, భవాని శంకర్, సింహం తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply