సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమ‌లు చేయాలి – సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో వ‌క్త‌ల డిమాండ్

సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమ‌లు చేయాలి

– సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభలో వ‌క్త‌ల డిమాండ్

తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 01, అద్దం న్యూస్ :    సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమ‌లు చేయాలని ప‌లువురు వ‌క్త‌లు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సాధనకై సిపిఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ( టిజిసిపిఎస్‌యు ) ఆధ్వర్యంలో టీజీఇ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌భ‌కు ఎమ్మెల్సి మ‌ల్క కొముర‌య్య‌, మాజీ ఎమ్మెల్సి, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా టీజీఇ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ… సెప్టెంబర్ 1వ తేదీ ఉద్యోగులకు విద్రోహ దినమ‌న్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. ఉద్యోగులకు పెన్షన్ భిక్ష కాదు కనీస హక్కు అని అన్నారు. 2004 సెప్టెంబర్ 1 తరువాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని వర్తింపచేయడం జరిగిందన్నారు. దీంతో ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ సౌకర్యం లేక వృద్దాప్యంలో ఆర్ధిక, అనారోగ్య సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేటికి పాత పెన్షన్ విధానమే కొనసాగుతుందని, అలాగే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు పాత పెన్షన్ పునరుద్ధరణకు సిద్దమవుతున్నాయన్నారు. సీపీఎస్ ను రద్దు చేసి ఒపీఎస్ విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద‌న్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, సీపీఎస్ లో లోపాలు ఉన్నాయి కాబట్టి ఓపీఎస్ ను తీసుకువచ్చారన్నారు. అనేక క్లిష్ట పరిస్థితులను పరిష్కరిస్తున్న సీఎం ఓపీఎస్ ను కూడా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒపీఎస్ అమలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, ఇదే సెప్టెంబర్ 1 వ తేదీ సీపీఎస్ ఉద్యోగులకు చివరి విద్రోహా దినం కావాలని ల‌చ్చిరెడ్డి అన్నారు. సీఎం మన సమస్యను మానవీయ కోణంలో పరిష్కరిస్తోందని నమ్మకం ఉందన్నారు. రెవెన్యూ శాఖకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చినట్లుగానే సీపీఎస్ ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాయ‌న్నారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ… పెన్షన్ ప్రాథమిక హక్కు అని ఇటీవల సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించిందన్నారు. గౌరవ ప్రథమంగా జీవించే హక్కులో భాగమే పెన్షన్ అని అన్నారు. ఇందులో కీలకమైన అంశాలు పిక్స్ డ్ పెన్షన్, పిక్స్ డ్ పే మెంట్ వంటి మౌలిక తేడాలున్నాయన్నారు. మార్కెట్‌లోని ఆటుపోట్లను బట్టి మన పెన్షన్ పై గ్యారెంటీ లేదన్నారు. ఉద్యోగి పెన్షన్ పెట్టుబడిదారుల చేతిలో ఉందని, పెన్షన్ ను ఒక హక్కుగా ప్రభుత్వం గుర్తించాలని కోదండ‌రాం అన్నారు. ఈ సభలోని అంశాలను ప్రభుత్వానికి చేర్చుతానని హామినిచ్చారు. ఇప్పటికే గతంలో చీఫ్ సెక్రటరీకి ఓ నివేదిక సమర్పించడం జరిగిందని, మన సమస్యపై కసరత్తు చేయాలని, ప్రభుత్వం పై పడుతున్న భారం పై కసరత్తు చేయాలన్నారు. సీపీఎస్ ఉద్యమానికి నా వంతు మద్దతు ఉంటుందన్నారు.

ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ… ఈ సమస్య పై ఇప్పటికే గవర్నర్ తో పాటు అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 లో నూతన పెన్షన్ విధానానికి ఒప్పుకోవడం వలన సీపీఎస్ అమలు జరుగుతుందన్నారు. నాకు ఓట్లు వేసి గెలిపించిన‌ ఉపాద్యాయులకు రుణపడి ఉంటానని, మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఒపీఎస్ కోసం ప్రభుత్వాన్ని ఒప్పిద్దామని… లేదంటే సీపీఎస్ రద్దు కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు.                               ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీపీఎస్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలన్నారు. ఉద్యోగికి పెన్షన్ భిక్ష కాదు, హక్కు. పీఆర్పీ, డీఏ లు పెండింగ్‌లోనే ఉన్నాయ‌న్నారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పాదించిన ఏకీకృత పెన్షన్ విధానాన్ని ( యుపిఎస్ ) రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1980 పెన్షన్ రూల్ ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి ఉద్యోగుల ఆత్మగౌరవం ను కాపాడాలన్నారు. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ లేకుండానే పదవి విరమణ తర్వాత సర్వీస్ ను బట్టి పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఉద్యోగంలో ఉండి చనిపోయిన లేదా పదవి విరమణ తర్వాత చనిపోయిన కూడా ఫ్యామిలీ పెన్షన్ అవకాశం ఉంటుంద‌న్నారు. షేర్ మార్కెట్ ఒడి దుడుకుల మీద ఆధారపడి పెన్షన్ ఇవ్వడమన్నది ఎండమావిలో నీటిని వెతకడమే అవుతుందన్నారు. తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎల్.దర్శన్‌ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ స‌భ‌లో జేఏసీ కో- ఛైర్మ‌న్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీ, తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కె.రామకృష్ణ, జనరల్ నాగవల్లి ఉపేందర్, ఎస్.రాములు, రాధ, ఎం.శ్రీనివాస్, శంకర్, కె.హన్మంత్ రావు, దేవేందర్, జి.కృపాకర్, కె.రాములు, బాణాల రాంరెడ్డి, పాక రమేష్, డా.జి.నిర్మల, డా. కత్తి జనార్ధన్, హబీబ్ మస్తాన్, గరికే ఉపేందర్ రావు, ఎస్.వి.సుబ్బయ్య, మహిపాల్ రెడ్డి, ఊదరి గోపాల్, పీహెచ్. రవి, ఎస్. నర్సింలు, రొక్కం దేవిక, బి.సుద‌ర్శ‌న్‌ గౌడ్, ఎం.చంద్ర శేఖర్ గౌడ్, కొంగల వెంకట్, సాయిరెడ్డి, పి.లక్ష్మయ్య, ఎస్. నర్సింలు, ఆవుల సైదులు, రాందాస్, డా.రామకృష్ణ, ఎస్.హరి కిషన్, కె.సందీప్ కుమార్, మహమ్మద్ మోహినుద్దిన్, ఆర్.కిరణ్ కుమార్, శ్రీకాంత్,హేమలత, జి.మహేష్ కుమార్, సుగంధిని, రాంబాబు, చైతన్య క్రిష్ణ, మల్లేశం, రాందాస్ శోభన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page