జిహెచ్ఎంసి స్పోర్ట్స్ మీట్ – 2025 లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 27, అద్దం న్యూస్ :    జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ఉద్యోగులు, ప్రెస్ రిపోర్టర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ –2025 కార్యక్రమం శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి షటిల్ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీల‌త‌ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి నిర్వహించిన ఈ ప్రత్యేక క్రీడా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌ ద్వారా కార్పొరేటర్లు, ఉద్యోగులు, ప్రెస్ రిపోర్టర్ల మధ్య ఐక్యత ఏర్పడింది. ఇది అందరికీ ఒక కొత్త ఉత్సాహం నింపుతుందని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా క్రీడా స్ఫూర్తి మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వివిధ క్రీడల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page