హైదరాబాద్, అద్దం న్యూస్ : తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ స్కూల్ 10వ తరగతి విద్యార్థినులకు నాయిని నర్సింహారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్‌ల పంపిణి కార్యక్రమం బుధవారం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నాయిని నరసింహ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై 10వ తరగతి విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్‌లను అందచేశారు. పదవ తరగతి పరీక్షలు రాయనున్న 58 విద్యార్థినులకు శ్రీనివాస్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియచేశారు. నాయిని నరసింహ రెడ్డి ఫౌండేషన్ ఆద్వర్యంలో ఎస్ఎస్‌సి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన వారికి స్కాలర్‌షిప్‌లను అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్సియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వాణిశ్రీ, ఉపాధ్యాయులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిగిరి శ్యామ్, సిరిగిరి కిరణ్, మధు, బాలయ్య, పర్వేజ్, వెంకటేష్, సంతోష్, కల్పన, అనురాధ, మేరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply