తెలంగాణలో విదేశీ యూనివర్శీటీలను అనుమతించొద్దు – ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేత

 తెలంగాణలో విదేశీ యూనివర్శీటీలను అనుమతించొద్దు
మన రాష్ట్ర యూనివర్శీటీలను ప్రపంచ యూనివర్శీటీలుగా మార్చేందుకు ప్రణాళికలు ఉండాలి
ఫారిన్ యూనివర్శీటీలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం
– ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డికి వినతిపత్రం అందజేత

హైదరాబాద్, డిసెంబ‌ర్ 6, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో విద్యారంగం అభివృద్ధి కోసం అంటూ విదేశీ యూనివర్శీటీలను తెలంగాణ రాష్ర్టానికి తీసుకుని రావడం మానుకోవాలని, విదేశీ యూనివర్శీటీలను అనుమతించోద్దని కోరుతూ భారత విద్యార్ధి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డికి టి.నాగరాజు, ఎస్.రజనీకాంత్, డి.కిరణ్, కె.అశోక్ రెడ్డిలతో కూడిన ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్శీటీలను ప్రపంచస్థాయి యూనివర్శీటీలతో పోటి పడేలాగా చేస్తామని చెప్పి ఆస్ట్రేలియా, జర్మనీ, యూకె.ల నుండి అక్కడ యూనివర్శీటీలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వడం అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కార్పోరేట్, విదేశీ కబంధ హస్తాలకు అప్పజెప్పడమేనని అన్నారు. ఈ రాష్ట్ర సాధనలో ముందువరుసలో ఉండి ప్రాణాలు కోల్పోయింది మన రాష్ట్ర యూనివర్శీటీలు విద్యార్ధులేనని వారి త్యాగానికి విదేశీ యూనివర్శీటీలను తీసుకుని వస్తే అవమానించడమేనని అన్నారు.

             పోటి ప్రపంచంతో మన విద్యార్థులు పోటి పడాలంటే కావాల్సింది విదేశీ యూనివర్శీటీలు కాదని ,వాటితో పోటి పడే సామర్థ్యం అని దాని కోసం నిధులు కేటాయించి, అభివృద్ధి చేయాలని ఎస్.ఎఫ్.ఐ. కోరుతుందని అన్నారు. ఇక్కడ వనరులు, మానవ వనరులు విదేశీ యూనిట్ వర్శీటిలకు తాకట్టు పెట్టవద్దని తెలిపారు. అలాగే ఇక్కడకు వచ్చే యూనివర్శీటీలు అక్కడ వాటి ర్యాంకులు,క్యాంపస్ వివరాలు ఎమి తెలియకుండా ఒప్పందం చేసుకోని మన రాష్ట్ర విద్యారంగాన్ని దెబ్బతిసే చర్యలు కాంగ్రెస్ పాల్పడవద్దని వారు కోరారు. ఉన్నత విద్యామండలి చైర్మైన్ మాట్లాడుతూ… ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page