Sunday, October 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADరక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి •రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి •రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్‌

📰 Generate e-Paper Clip

రాంన‌గ‌ర్‌, అక్టోబర్ 17, ( అద్దం న్యూస్ ) :     

రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి అని రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. సేవా సంకల్ప అభయాన్‌లో భాగంగా బిజెవైఎం స‌భ్యుడు రాజ్ కిర‌ణ్ ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ హ‌రిన‌గ‌ర్ వైట్ హౌస్ హోట‌ల్ వ‌ద్ద జ‌రిగిన ర‌క్త‌దాన శిబిరానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మానవాళికి సేవ చేసేందుకు, అవసరంలో ఉన్నవారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు మనమంతా ఏకమవుదామ‌న్నారు. ప్రతి రక్తపు చుక్కా విలువైనదే, ప్రతి రక్తదాతా ఒక ప్రాణదాతే అని అన్నారు. మీరు ఇచ్చే రక్తం మరొకరికి జీవితంలో కొత్త అవకాశాన్ని కల్పించగలద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి మ‌హంకాళి జిల్లా అధ్య‌క్షుడు భ‌ర‌త్‌గౌడ్‌, బీజేపీ ఎస్సీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గడ్డం నవీన్, బిజెపి నాయ‌కులు మ‌హేష్‌, రాకేష్‌, చ‌క్ర‌పాణి, న‌ర్సింగ్‌రావు, జాన్స‌న్‌, న‌రేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page