మంచినీటిలో వస్తున్న డ్రైనేజీ కాలుష్యాన్ని ఆరికట్టాలి – హైదరాబాద్ సిటిజన్ ఫోరం

మంచినీటిలో వస్తున్న డ్రైనేజీ కాలుష్యాన్ని ఆరికట్టాలి
– హైదరాబాద్ సిటిజన్ ఫోరం

బాగ్‌లింగంప‌ల్లి, మే 8, ( అద్దం న్యూస్ ) :  ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి క్వాటర్స్‌లో మంచినీటిలో వస్తున్న డ్రైనేజి కాలుష్యాన్ని ఆరికట్టాలని హైదరాబాద్ సిటిజన్ ఫోరం డిమాండ్ చేసింది. శుక్ర‌వారం బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి క్వాటర్స్‌లో వాట‌ర్ వ‌ర్క్స్ నారాయ‌ణ‌గూడ‌ జిఎం శ్రీధర్, డిజిఎం విష్ణువర్ధన్ లు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య లు అధికారుల‌కు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… 2026 మార్చి 1వ నుండి బాగ్‌లింగంపల్లిలో ఎల్ఐజి క్వాటర్స్‌లో మంచినీటిలో డ్రైనేజి కలిసి వస్తున్నదని, దుర్వాస‌న‌తో కూడిన డ్రైనేజి నీరు రావడంతో కొంతమంది మంచినీరు పట్టుకోవడమే మానేస్తున్నారని తెలిపారు.

ఈ నీరు త్రాగుతే అనేక రోగాలు వస్తాయాని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, మరి కొంత మంది బయపడి డబ్బులు పెట్టి మీనరల్ వాటర్ తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంద‌న్నారు. ఈ సంవ‌త్స‌రం మార్చి 1వ తేదీన, ఏప్రిల్ 8న మంచినీటిలో డ్రైనేజి కలిసి వస్తుదని జిఎం కు, డిజిఎంకు, మేనేజర్‌కు ఫిర్యాదులు చేశామ‌న్నారు. వారు ప‌రిశీలన కూడా చేశార‌ని తెలిపారు. కానీ ఇప్పటికి అదే పరిస్థితి కొనసాగుతున్నదని, గత కొన్ని సంవత్సరాల నుండి బాగ్‌లింగంపల్లిలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అధికారుల‌కు తెలిపారు. క‌లుషిత నీటి స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని జీఎం శ్రీధ‌ర్‌రెడ్డి, డిజిఎం విష్ణువ‌ర్థ‌న్‌ల‌ను కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సిఎఫ్‌ నాయకులు నాగేశ్వరరావు, సంగీత, రమేష్, శంకరయ్య, నగేష్, పాల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page