కాంగ్రెస్ ప్రభుత్వంలో డ్ర‌గ్స్ మాఫియా, మాద‌క ద్ర‌వ్యాలు నిత్య కృత్యమైంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 12, అద్దం న్యూస్ :   గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా వెలసిన డ్రగ్స్ మాఫియా, మాదక ద్రవ్యాల సరఫరా తగ్గకపోగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్య కృత్యమైందని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా పేర్కొన్నారు. హైద‌రాబాద్ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ మాఫియాకు కేంద్ర బిందువైందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల గాంధీభవన్ వద్ద యధేచ్ఛగా గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడటం జరిగిందని, గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో 9 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అవడం కలకలం సృష్టిస్తుందన్నారు. ఈ పరిస్థితుల దృష్టా రాష్ట్రం ఎటువైపు వెళ్తుందోనని విచారం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో అనుమానాలు వ్యక్తం అమవుతున్నాయన్నారు. ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నట్లు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతుయన్నారు. ఈ డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలన్నారు. కానీ నిందితులకు శిక్షలు తక్కువగా పడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో సాధారణ నేరాల్లో 2023లో 41 శాతం కేసులలో శిక్షలు ఖరారైతే… డ్రగ్స్ కేసులలో 20 శాతం నిందితులకే శిక్షలు పడ్డాయన్నారు. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 12 లక్షల మంది మాధకద్రవ్యాల గుప్పెట్లో చిక్కుకున్నారని తెలుస్తోందని, భారత్ కు వచ్చిన నైజీరియన్లలో సుమారు 2 వేల మంది డ్రగ్స్ వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంద‌న్నారు. వీరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుని అవసరమైతే డిపోర్టేషన్ చేయాల‌ని, మాజీ మంత్రి కేటీఆర్ బావమర్ధి పాకాల రాజేంద్రప్రసాద్ కు చెందిన జన్వాడా ఫాంహౌస్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లు కేసు నమోదు అయింద‌ని, డ్రగ్స్, గంజాయి మాఫియా ఏ స్థాయిలో వ్యవస్థీకృతమైందో తెలుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అత్యాచారాలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాల సంఖ్య నానాటికి పెరిగిపోవడానికి మూలకారణం మద్యం, మాదక ద్రవ్యాలు, నీలి చిత్రాల వీక్షణ అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారన్నారు. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు వైఫల్యాలు చెందుతున్నాయని, మద్యం, మాదకద్రవ్యాలు, నీలి చిత్రాల వీక్షణ ఈ 3 మూల కారణాలను నిర్మూలిస్తే అత్యాచారాలను తగ్గించవచ్చనేది నిపుణుల అభిప్రాయమ‌న్నారు. ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో వీటిని నియంత్రించి చూపాలన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించి, అవసరమైన చోట్ల అదనపు సిబ్బందిని కేటాయించి కఠిన చర్యలు చేపట్టి నశా ముక్తి రాష్ట్రంగా మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్, టిడిపి నాయ‌కులు ఎస్.ప్రకాష్, కిరణ్, భాను ప్రకాష్, బి.రాజు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page