గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో బిజెపిని ప‌టిష్టం చేసేందుకు కృషి చేయాలి

హైదరాబాద్, నవంబర్ 23, అద్దం న్యూస్ :    గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో బిజెపిని ప‌టిష్టం చేసేందుకు కృషి చేయాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి, దిశా కమిటీ సభ్యురాలు శారదా మల్లేష్ అన్నారు. రాబోయే రోజుల్లో గాంధీనగర్ డివిజన్ బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ముఖ్య కార్యక్రమాల కార్యాచరణ సమావేశం ఆదివారం అశోక్‌న‌గ‌ర్‌ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి, దిశా కమిటీ సభ్యురాలు శారదా మల్లేష్ హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో డివిజన్‌లో చేపట్టవల్సిన కార్యక్రమాలు, వందేమాతరం 150 సంవత్సరాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, ఆత్మ నిర్భర్ భారత్, బూత్ కమిటలు వంటి అంశాల పై చ‌ర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బిజెపి రాష్ట్ర పార్టీ సూచనల మేరకు జరగబోయే కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు డివిజన్‌లోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల‌న్నారు. ముఖ్యంగా రాబోయే జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ స్థానాలలో విజయం సాధించి కచ్చితంగా మేయర్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకోవాల‌న్నారు. ఈ స‌మావేశంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్వులు న‌వీన్, ఆనంద్‌రావు, బీజేపీ సీనియర్ నేతలు శ్రీకాంత్, రాజు, దామోదర్, ఎం.ఉమేష్, సురేష్ రాజు, ,విజయ లక్ష్మి, సంయుక్త రాణి, డివిజన్ లోని పదాధికారులు, ముఖ్య నాయకులు, మోర్చల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page