ప్రతి యువకుడు సైనికుల వలె కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలి – బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య‌

 

ప్రతి యువకుడు సైనికుల వలె కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలి

– బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య‌

 

హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :    ప్రతి యువకుడు సైనికుల వలె కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య అన్నారు. జ‌మ్మూకాశ్మీర్ ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌వాదుల దాడిలో మృతి చెందిన టూరిస్టుల ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో నివాళి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆర్.కృష్ణ‌య్య హాజ‌రై మౌనం పాటించి ఉగ్ర‌దాడుల్లో మృతి చెందిన టూరిస్టుల ఆత్మ‌శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ… పహల్గాం లాంటి ఘటన మళ్లీ దేశంలో జరగకూడదన్నారు. పహల్గామ్‌లో అమాయ‌క టూరిస్టుల‌పై ఉగ్ర‌వాదులు దాడి చేయ‌డం పిరికిపంద చర్యని మండిపడ్డారు. ఇటువంటి దాడులతో భారత స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. టెర్రరిస్ట్‌లపై యుద్ధాన్ని రాజకీయాలకతీతంగా చూడాలన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంపై ఇలాంటి దాడులు ఏమాత్రం క్షమించరానివని, తప్పనిసరిగా రానున్న రోజుల్లో పాకిస్తాన్ తీవ్రవాదులకు తీవ్రస్థాయిలో గుణపాఠం భారత్ చెప్పితీరుతుందన్నారు. అందుకోసం యావత్ భారత్ ప్రజలందరూ కూడా ఏకమై అవసరమైతే ప్రతి ఒక్కరు ఒక సైనికుడు వలె ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారత జాతీయ సమగ్రతను జాతీయ ఐక్యతను కాపాడుకునేందుకు దేశ ప్రజలందరూ ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని తెలుపుతూ పాకిస్తాన్ ముస్కరులను తీవ్రంగా హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాల‌ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని, ఇది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఐక్య‌మత్యం చాటుకోవాల్సిన సందర్భం అని అన్నారు. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదని.. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page