...

ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయండి

 ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయండి

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 3, ( అద్దం న్యూస్ ) :   ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న ” ఛలో హైదరాబాద్ ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఖైరతాబాద్ కళాశాల బాధ్యుడు ప్రవీణ్ మాట్లాడుతూ… విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్య బలోపేతం కోసం నిర్వహిస్తున్న ” ఛలో హైదరాబాద్ ” కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా మాట్లాడుతూ… విద్యార్థుల హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నెల 6న జరిగే కార్యక్రమానికి ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు పరిసర ప్రాంతాల కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ” ఛలో హైదరాబాద్ ” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కళాశాల కార్యదర్శి యశ్వంత్, మహేష్, అర్జున్, రజినీకాంత్, నీలోత్, అర్వింద్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.