హైదరాబాద్, అద్దం న్యూస్ : వెట్టిచాకిరి పై తిరగబడ్డ ఫిరంగి దొడ్డి కొమురయ్య అని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, టిపిఎస్కె రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ నెల 3వ తేదీన బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్న దొడ్డి కొమరయ్య 98వ జయంతి సభ సంబంధించిన వాల్ పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పాశం యాదగిరి, భూపతి వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ… దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వెట్టి చాకిరి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతమైన వీరుడు దొడ్డి కొమరయ్యాని కొనియాడారు. ఈ జయంతి వేడుకలకు ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, విప్లవ గాయకురాలు విమలక్క, వినయ్ కుమార్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి, దొడ్డి రమెష్, గనం నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply