ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టిన ఫైర్ ఇంజ‌న్‌ – యువ‌తి మృతి, త‌ల్లి, కొడుకు కు తీవ్ర గాయాలు – ఫైర్ ఇంజ‌న్ డ్రైవ‌ర్‌ పై కేసు న‌మోదు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టిన ఫైర్ ఇంజ‌న్‌

– యువ‌తి మృతి, త‌ల్లి, కొడుకు కు తీవ్ర గాయాలు

– ఫైర్ ఇంజ‌న్ డ్రైవ‌ర్‌ పై కేసు న‌మోదు చేసిన‌ చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 21, అద్దం న్యూస్ :    ఫైర్ ఇంజిన్ వాహ‌నం ఢీకొని ఒక యువ‌తి మృతి చెంద‌గా, త‌ల్లి, కొడుకు కు తీవ్ర గాయాలైన సంఘ‌ట‌న చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. చిక్క‌డ‌ప‌ల్లి ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… మైలార్ దేవులపల్లి శాస్త్రిపురంకు చెందిన ఫాతిమ బేగం తన కుమారుడు ఇబ్రహీం, కుమార్తె మెహ‌క్ (18) తో కలిసి సోమవారం ముషీరాబాద్‌లో బంధువుల ఇంట్లో జ‌రిగిన గ్యార్మీ వేడుకల్లో పాల్గొనేందుకు వ‌చ్చారు. సోమ‌వారం రాత్రి 10:30 గంట‌ల స‌మ‌యంలో వీఎస్‌టి చౌర‌స్తా మీదుగా మైలార్‌దేవుల ప‌ల్లికి తిరుగుప్ర‌యాణమ‌య్యారు. ఇబ్ర‌హీం ద్విచ‌క్ర వాహ‌నాన్ని న‌డుపుతుండ‌గా త‌ల్లి, సోద‌రి వెన‌కాల కూర్చున్నారు. అదే స‌మ‌యంలో అడిక్‌మెట్ వైపు వెళ్లేందుకు ఫైర్ ఇంజ‌న్ వెళ్తుంది. వీఎస్‌టి చౌర‌స్తా వ‌ద్ద ఎడ‌మ వైపు తిప్పుతున్న స‌మ‌యంలో ఇబ్ర‌హీం న‌డుపుతున్న ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఫైర్ ఇంజిన్ వాహ‌నం వెన‌కాల నుంచి ఢీకొట్టింది. ఇబ్ర‌హీంతో పాటు త‌న త‌ల్లి, సోద‌రి కింద‌ప‌డిపోయారు. ఫైర్ ఇంజ‌న్ వాహ‌నం మెహ‌క్ త‌ల పై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌నలో మెహ‌క్ తీవ్ర గాయాల‌తో అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, ఫాతిమా, ఇబ్ర‌హీం ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. విష‌యం తెలుసుకున్న చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు మృతి చెందిన మెహ‌క్ మృత‌దేహాన్ని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించగా, గాయప‌డ్డ ఫాతిమా, ఇబ్ర‌హీం ల‌కు గాంధీలోనే చికిత్స నిమిత్తం త‌ర‌లించారు. ఫైర్ ఇంజ‌న్ వాహ‌నం న‌డిపిన డ్రైవ‌ర్ పై చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page