నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

హైదరాబాద్, జులై 18, అద్దం న్యూస్ : సినీ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ డ్యామేజ్ కావడంతో డయాలసిస్ కోసం కొన్ని రోజుల క్రితం బోడుప్పల్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత మరో హాస్పిటల్‌కు మార్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పినట్లు ఆయన కుమార్తె ఇటీవల తెలిపారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్న కొద్ది రోజులకే ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వెంకట్ వందకుపైగా సినిమాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆది సినిమాలో తొలిసారి నటించిన వెంకట్ ఆ తర్వాత దిల్, బన్ని, లక్ష్మీ, చెన్నకేశవరెడ్డి, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది, డాన్ శీను, కింగ్, దరువు, మిరపకాయ్, సుప్రీమ్, డిజె టిల్లు తో పాటు చివరగా కాఫి విత్ ఏ కిల్లర్ సినిమాలో నటించారు. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. కాగా ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో చేపల వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ మోహన్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply