ఘనంగా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు

మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ మాజీ ఎంపి ఎం.అంజన్ కుమార్ యాదవ్ బర్త్ డే వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న రెయిన్‌బో హోంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండెం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిన్నారుకు పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాంనగర్ చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతితిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్ యాదవ్ ( టిల్లు ) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, ఎ, బి బ్లాక్ ల అధ్యక్షుడు విడి.కృష్ణ, అంజి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకేష్ యాదవ్, పాశం అనిల్ కుమార్ యాదవ్, మధుసూదన్, పీటర్, రమేష్ గౌడ్, రాజ్‌దీప్, వైపి.రాజు, వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply