...

ఈ నెల 6న ముషీరాబాద్‌ కేర్ హాస్పిట‌ల్‌లో ఉచిత ఆస్తమా చెకప్

 

 ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా

ఈ నెల 6న ముషీరాబాద్‌ కేర్ హాస్పిట‌ల్‌లో ఉచిత ఆస్తమా చెకప్

 

హైద‌రాబాద్‌, మే 4, అద్దం న్యూస్ :   ప్రపంచ ఆస్థమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్, ‘ప్రతి క్షణం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోండి’ పేరుతో ఈ నెల‌ 6న ఉచిత ఆస్థమా అవగాహన, స్క్రీనింగ్ శిబిరాన్ని జ‌రుగ‌నుంది. ఈ శిబిరం ద్వారా ప్రజల్లో ఆస్థమా గురించి అవగాహన పెంచాలని, వ్యాధిని తొందరగా గుర్తించి, చికిత్స ప్రారంభించేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లోని కేర్ హాస్పిటల్స్ సీనియర్ శ్వాసకోశ నిపుణుడు ( పల్మోనాలజిస్ట్ ) డాక్ట‌ర్‌.సయ్యద్ అబ్దుల్ అలీం మాట్లాడుతూ… ఈ నెల 6వ తేదీన ఉద‌యం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉచిత పల్మనాలజిస్టు వైద్యుల కన్సల్టేషన్లు, ఉచిత పల్మనరీ ఫంక్షన్ టెస్టులు (పిఎఫ్‌టి ) అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. అలాగే ఆస్థమా లక్షణాలు ఎలా గుర్తించాలి, సాధారణ కారణాలను ఎలా నివారించాలి, చికిత్స ఎలా తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. “భారతదేశంలో సుమారు 3.5 కోట్ల మందికి పైగా, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా ఆస్థమా ఉందని, దీన్ని సమయానికి గుర్తించకపోతే లేదా సరైన చికిత్స తీసుకోకపోతే జీవితం మీద చెడు ప్రభావం పడుతుందన్నారు. నగరాల్లో ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరికి, ప్రతి 12 మంది పెద్దల్లో ఒకరికి ఆస్థమా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఆస్థమా వల్ల జరిగే మరణాల్లో భారత్‌లో వాటా 42 శాతం ఉంద‌ని, వీటిలో చాలా వరకు నివారించవచ్చున‌ని తెలిపారు. ఇన్హేలర్‌లను సరైన పద్ధతిలో ఉపయోగించి, రెగ్యులర్‌గా చికిత్స తీసుకుంటే అత్యవసర హాస్పిటల్‌కు వెళ్లే అవసరం 60 శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ శిబిరం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచుకోవాల‌ని కోరారు. ముషీరాబాద్‌ లోని కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్ట‌ర్‌.భారతి మాట్లాడుతూ… ప్రపంచ ఆస్థమా దినోత్సవం 2025 కోసం ఈసారి తీసుకున్న థీమ్‌ – “ఇన్హేల్డ్ చికిత్సలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఈ థీమ్ ప్రకారం, ప్రతి ఆస్థమా బాధితుడికి ఇన్హేల్డ్ మందులు అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యమ‌న్నారు. ఈ విషయంపై “ఆస్థమా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా దాన్ని మనం సరిగ్గా చూసుకుంటే నియంత్రించవచ్చు.. కానీ చాలా మందిలో ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేదన్నారు. దగ్గు, ఛాతీలో బిగుదల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రిళ్లు లేదా తెల్లవారుజామున ఎక్కువగా ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలను మనం పట్టించుకోవాల‌న్నారు. అలాగే ధూళి, పొగ, కాలుష్యం వంటి వాటి నుండి దూరంగా ఉండటంతో ఆస్థమా బాధలను తగ్గించుకోవచ్చు అని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.