Sunday, November 8, 2026
No menu items!
HomeCultureఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో ఘ‌నంగా దీపావ‌లి వేడుక‌లు

ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో ఘ‌నంగా దీపావ‌లి వేడుక‌లు

📰 Generate e-Paper Clip

క‌వాడిగూడ‌, న‌వంబ‌ర్ 7, ( అద్దం న్యూస్ ) :

హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడలోని ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్ లో శ‌నివారం ఘ‌నంగా దీపావ‌ళి వేడుక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా స్కూల్ కరస్పాండెంట్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హాజ‌రై స్కూల్ బాల‌, బాలిక‌ల‌తో క‌లిసి ట‌పాసులు కాల్చి సంబ‌రాల‌ను జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటామ‌న్నారు. మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగులను నింపడమే ఈ పండుగ అంతరార్థం అని అన్నారు. ఈ దీపావళిని మనం పర్యావరణానికి హాని కలగకుండా, ప్రమిదలు వెలిగించి, ఆనందంగా జరుపుకోవాల‌న్నారు. పొగ, శబ్దం లేని పర్యావరణ హిత దీపావళి ( Green Diwali ) జరుపుకోవాలని విద్యార్థులను సూచించారు. బాణసంచా వల్ల కలిగే కాలుష్యం, పటాకుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఉండాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రిన్సిపాల్ స్వ‌ర్ణ‌ల‌త‌, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
Previous article
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

Advertisement

Advertisement

You cannot copy content of this page