అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
హైదరాబాద్, మార్చి 25, అద్దం న్యూస్ : అప్స స్వచ్ఛంద సంస్థ, రాహుల్ ఐ ఫౌండేషన్, ఆద్య హాస్పిటల్ సంయుక్తాధ్వర్యంలో హైదరాబాద్ దోమలగూడలోని బండానగర్ బస్తీలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆద్య హాస్పిటల్ మహిళా వైద్య నిపుణురాలు డాక్టర్.భవాని హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు వైద్యం అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్.భవాని మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమై ఆకు కూరలు, గుడ్లు, పండ్లు వంటివి తీసుకోవాలన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికి అప్పుడు వైద్య పరీక్షలు చేసుకొని డాక్టర్ సలహాలు పాటించాలని, పేద మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ పేదల కొరకు చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు.
రాహుల్ ఐ ఫౌండేషన్ కంటి వైద్యురాలు నవ్య మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు కంటి ఫై శ్రద్ధ వహించాలని, మా సంస్థ ద్వారా కంటి శుక్లలు ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ప్రతిరోజు కంటిని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలని అన్నారు. డాక్టర్.మౌనిక, డాక్టర్.సౌమ్య మాట్లాడుతూ… నేడు వయసుతో నిమిత్తం లేకుండా వ్యాధులు వస్తున్నాయని, వాటిని నివారించాలంటే డాక్టర్ సలహాలు పాటించాలని అన్నారు. అప్స సీనియర్ కో–ఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ… పేద ప్రజలూ ఆరోగ్యంగా ఉండాలని అప్స సంస్థ బస్తీల్లో దాతల సహాయంతో వైద్య శిబిరాలను నిర్వహించడమే కాకుండా పేదలకు 15 రోజులకు సరిపడా మందులు ఉచితంగా ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆద్య హాస్పిటల్ ప్రతినిధులు శ్రావణి, రజిత, చెన్నయ్య, కో–ఆర్డినేటర్ రాజేశ్వరి, శోభా, ప్రతినిధులు శ్రావణి, లావణ్య, మల్లిక, ఇందిర, బండానగర్ సీనియర్ బిజేపి కార్యకర్త కుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్యం పొందిన 200 మంది పేదలకు ఉచితంగా మందులను అందచేశారు.![]()

![]()












Leave a Reply