హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు జి.నాగభూషణం నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. జి.నాగభూషణం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక శాఖ సలహామండలి బోర్డు వైస్ ఛైర్మన్‌గా, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కో-ఆర్డినేటర్‌గా, 2024 ఎంపి ఎన్నికల్లో భాగంగా అంబర్‌పేట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలికులుగా పని చేశారు. ప్రస్తుతం ఆయనను టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ… తన పై నమ్మకంతో పార్టీ అధిష్టానం తనను టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply