
మన సంప్రదాయాలు, భక్తి శ్రద్ధలు, హిందువుల ఐక్యతకు ప్రతీక గణేష్ నవరాత్రి ఉత్సవాలు
– రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్
హైదరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : మన సంప్రదాయాలు, భక్తి శ్రద్ధలు, హిందువుల ఐక్యతకు ప్రతీక గణేష్ నవరాత్రి ఉత్సవాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ స్ట్రీట్ నంబర్ – 4 లో ఏర్పాటు చేసిన గణేష్ మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాజ్యసభ సభ్యుడు, ఓబిసి మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గణేష్ మండపాల్లో వినాయకుల విగ్రహాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలందరు సనాతన ధర్మాన్ని అనుసరించి భక్తి భావంతో విఘ్నేశ్వరుడిని పూజించి ఆయన దీవెనలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, విష్ణు ప్రసాద్, సురేష్ రాజు, రామ్ రెడ్డి, అనురాధ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply