జిహెచ్ఎంసి విభజన… ఒక రాజకీయ కుట్ర
» ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తెలుగుదేశం నాయకుల ధ్వజం
హైదరాబాద్, ఫిబ్రవరి 20, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసి పరిధిలో చెత్త సేకరణను సాకుగా చూపి, అటు కార్మికుల పొట్ట గొడుతూ, ఇటు ప్రజలపై భారం మోపుతున్న రాంకీ సంస్థ వైఖరితో కుమ్మక్కై తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు, హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… కార్మికుల జీవనోపాధిపై దెబ్బగా అభివర్ణించారు. తరతరాలుగా చెత్త సేకరణ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్ట గొట్టేలా రాంకీ సంస్థ వ్యవహరిస్తోంది. ఇంతకాలం నేరుగా ప్రజల నుండి వసూలు చేసుకునే సేకరణ ఛార్జీలను, ఇప్పుడు ఆస్తి పన్నులో కలిపి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం కార్మికుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే అని అన్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని నాయకులు హెచ్చరించారు.
జగద్గిరిగుట్ట, కేత్లాపూర్ వంటి డంపింగ్ యార్డుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబెట్టడం వల్ల కార్మికుల సమయం వృథా అవుతోందని, కాంటా ( బరువు ) వేయాలనే కొత్త నిబంధనలతో కార్మికులను అధికారులు వేధిస్తున్నారని, ఇది రాంకీ సంస్థకు లాభం చేకూర్చేందుకేనని టిడిపి నేతలు మండిపడ్డారు. అదే విధంగా జిహెచ్ఎంసి ని 3 కార్పొరేషన్లుగా విభజన వెనుక కేవలం రాజకీయ స్వప్రయోజనాలున్నాయని, అవినీతిని దాచిపెట్టే కుట్ర దాగుందని ఆరోపించారు. విభజన వల్ల ఆదాయం పంపిణీ జరిగి అభివృద్ధి కుంటుపడుతుందని, సమస్యల పరిష్కారం మరింత క్లిష్టంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తన వైఖరి మార్చుకోకపోతే, భారీ ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. సరిగ్గా 10 రోజుల క్రితం ఏర్పాటు చేసిన పత్రికా ప్రకటనలో రానున్న ఎండాకాలం సందర్బంగా అగ్ని ప్రమాదాలు జరుగవచ్చని ప్రభుత్వానికి హెచ్చరించినా.. ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్ల ఈ రోజు అమీర్‌పేటలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply