మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
– సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో, మార్చి 15, అర్థం న్యూస్ : రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదని ..విలువలను గుర్తుచేసే పవిత్ర మాసమన్నాడు. నెల రోజుల పాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి, షబ్బీర్ అలీకి సలహాదారుగా, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా ఉద్యోగ కల్పించడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. 8 మంది మైనారిటీ నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించాం అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ![]()













Leave a Reply