Wednesday, September 23, 2026
No menu items!
Homedevotionalతార్నాకలో ఘనంగా గణపతి పూజ.. నిమజ్జన డ్రెస్‌ల పంపిణీ

తార్నాకలో ఘనంగా గణపతి పూజ.. నిమజ్జన డ్రెస్‌ల పంపిణీ

📰 Generate e-Paper Clip

తార్నాక, సెప్టెంబర్ 23 ( అద్దం న్యూస్ ) :   తార్నాక స్ట్రీట్ నంబర్–1లో గణేష్ ఉత్సవాల సందర్భంగా బుధవారం గణపతి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఆర్టీఏ సభ్యుడు సురేష్ లాల్ నేతికర్, కాంగ్రెస్ నాయకుడు కమలేష్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం గణేష్ నిమజ్జనం సందర్భంగా పాల్గొనే యువతకు ప్రత్యేక డ్రెస్‌లను పంపిణీ చేశారు. యువత ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, గణేష్ మండప నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page