Thursday, September 24, 2026
No menu items!
Homedevotionalమణికేశ్వర నగర్‌లో గణనాథుడికి ఘనంగా ప్రత్యేక పూజలు

మణికేశ్వర నగర్‌లో గణనాథుడికి ఘనంగా ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

తార్నాక, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) :    మణికేశ్వర నగర్‌లో త్రిశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి గురువారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు బండ చంద్రారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ప్రత్యేక పూజల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకున్నారు. గణేశ నామస్మరణతో పూజా ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గోపాల్‌రెడ్డి, శివరాజ్, నవీన్‌కుమార్, నవీన్‌తో పాటు స్థానిక నాయకులు కొన్నే సంపత్, కేదారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page