హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఒక్క రోజు నిరాహార దీక్షను నిర్వహించనున్నట్లు జెఎసి ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి, సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫూల్ రామిరెడ్డి లు తెలిపారు. ఈ మేరకు నిరాహార దీక్షకు సంబంధించిన గోడ పత్రికను శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ సబర్మతినగర్ బస్తీలో వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 1969 తెలంగాణ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, కళాకారులు, సబండవర్గాలు పెద్ద ఎత్తున హాజరై ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెఎసి కోశాధికారి కలప చంద్రశేఖర్ ప్రసాద్, వేదిక అధ్యక్షుడు యాదగిరి, టిజిఎస్టి జెఎసి నాయకులు మెరుగు శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, సాయి, బస్తీవాసులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply