కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా – అంజన్ కుమార్ యాదవ్ ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారు – మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా

  అంజన్ కుమార్ యాదవ్ ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారు

– మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 10, అద్దం న్యూస్ :    కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా అని… అంజన్ కుమార్ యాదవ్ ఎప్పడు ఓడి పోలేదు.. ఓడ గొట్టారని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని అంజ‌న్ కుమార్ యాద‌వ్ తీవ్ర ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌ను గెలిపిస్తే జూబ్లిహిల్స్‌లో ఉచిత కేబుల్ క‌నెక్ష‌న్ ఇస్తా అని ఫ్లెక్సీల‌ను సైతం అంజ‌న్ కుమార్ యాద‌వ్ ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్‌ను న‌వీన్ యాద‌వ్‌కు కేటాయించింది. దీంతో అంజ‌న్ కుమార్ యాద‌వ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం పై గుర్రుగా ఉన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేర‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్‌, వివేక్ లు శుక్ర‌వారం ఆద‌ర్శ్‌న‌గ‌ర్‌లోని ఎమ్మెల్యే క్వాట‌ర్స్‌లో అంజ‌న్‌కుమార్ యాద‌వ్‌ను బుజ్జ‌గించేందుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అంజ‌న్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో న‌ర్స‌రీ నుంచి ప‌ని చేశాన‌న్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు నేను కంటెస్ట్ చేస్తే.. మంచి రోజులు వచ్చే సరికి ఇంక ఎవరో కంటెస్ట్ చేస్తే నాకు బాధగా ఉంటది కదా అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page