కృంగిన నాలాలో వాట‌ర్ ట్యాంక‌ర్ కుప్పకూలితే మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మికి ప‌ట్ట‌దా – ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

కృంగిన నాలాలో వాట‌ర్ ట్యాంక‌ర్ కుప్పకూలితే మేయర్ గద్వాల్‌ విజయలక్ష్మికి ప‌ట్ట‌దా

– ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

హైదరాబాద్, ఆగ‌స్టు 05, అద్దం న్యూస్ :   మేయర్ ఇలాకాలో కృంగిన నాలాలో వాట‌ర్ ట్యాంక‌ర్ కుప్పకూలితే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి ప‌ట్ట‌దా అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రోడ్ నెంబర్ వన్ బంజారాహిల్స్ మహేశ్వరి టవర్స్ వద్ద సోమ‌వారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి మెయిన్ నాల కుంగి అందులోకి వాటర్ ట్యాంకర్ కుప్ప కూలింది. ఈ విష‌యం తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, నాయకులు బుర్ర రామ గౌడ్, విజయ్ మల్లంగి, జావిద్ షరీఫ్, హేమాజిల్లోజు, శివాజీ, దర్శనం రమేష్ త‌దిత‌రులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ… బండి కొంటె టాక్స్, బండి పెట్రోల్ పోయాలంటే టాక్సీ, ఇంట్లో ఉండాలంటే ప్రాపర్టీ టాక్స్, సంపాదిస్తే ఇన్కమ్ టాక్స్, డబ్బు ఖర్చు పెడితే సేల్స్ టాక్స్ ఈ విధంగా అనునిత్యం ప్రజలపై టాక్స్ బాదుతున్న ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్లు తమ ప్రజానీకానికి కనీస పౌర సంబంధమైన సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నాయ‌న్నారు. వర్షం పడితే చాలు వరద నీటితో రోడ్లు నదుల్లా మారుతున్నాయని, నాలాలు కుంగిపోతున్నాయని, ఏ నిమిషాన ఏమి జరుగుతుందో అని తెలియక నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి జిహెచ్ఎంసిలోని అవినీతిని అరికట్టి, ప్రాణ నష్టం జరగకముందే, యుద్ద ప్రాతిపదికన రోడ్లు నాలాలను మరమ్మత్తు చేసి ఇలాంటి ఘటనలు తిరిగి జరగకుండా చూసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ క‌మిటీ త‌ర‌పున డిమాండ్ చేస్తున్న‌ట్లు సుధాక‌ర్ తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page