ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయండి
» బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్
హైదరాబాద్, జనవరి 7, అద్దం న్యూస్ : ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ… విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ సంవత్సరమైనా 2026 ఫీజు నియంత్రణ చట్టం తేవాలని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ను కోరామన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ధన దాహానికి బలైతున్న పేద మధ్యతరగతి విద్యార్థులను ప్రభుత్వం కాపాడాలన్నారు.
విద్య అనేది అది సామాజిక హక్కు కానీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలో దోపిడీతో పేద వర్గాలకు విద్య అనేది అందని ద్రాక్షగా మారుతుందన్నారు. కాబట్టి వెంటనే విద్య హక్కు చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తాటికొండ విక్రమ్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇంద్రం రజక, భాస్కర్, బీసీ నాయకులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply