జార్జి రెడ్డి స్ఫూర్తితో మతోన్మాద, పాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం

జార్జి రెడ్డి స్ఫూర్తితో మతోన్మాద, పాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం
– పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, నాగరాజు

హైదరాబాద్, ఏప్రిల్ 3, అద్దం న్యూస్ :   జార్జి రెడ్డి స్ఫూర్తితో మతోన్మాద, పాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదామ‌ని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు లు అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో స్థానిక హైద‌రాబాద్‌ విద్యానగర్ రాష్ట్ర కార్యాలయం మార్క్స్ భవన్‌లో ఈ నెల 10 నుండి 14వ తేదీ వరకు జార్జి రెడ్డి 54 వ వర్ధంతి సభల గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మహేష్ పొడపంగి నాగరాజులు మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలో పిడిఎస్‌యు సంస్థను జార్జిరెడ్డి స్థాపించి మతోన్మాద, మనువాద, శక్తుల అరాచకపు ఆధిపత్యాన్ని ఎదిరించి పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల విద్యార్థులకు అండగా నిలిచాడ‌న్నారు. ఓయూ క్యాంపస్‌లో జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికలు బరిలో నిలబెట్టి విద్యార్థుల హక్కుల కోసం జరిగిన పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించి వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాడ‌న్నారు. అసమానతలు, అంటరానితనం పోవాలంటే దేశంలో కుల, మతాలకు అతీతంగా శాస్త్రీయ విద్య విధానాన్ని అమలు చేయాలని సమానమైన విద్య అందాలనే కోరాడన్నారు.

జార్జి రెడ్డిని చూసి ఓర్వలేని మతోన్మాద గుండాలు, హిందుత్వ మూకలు 1972 ఏప్రిల్ 14న జార్జి రెడ్డిని అత్యంత క్రూరంగా హతమార్చడం జరిగింద‌న్నారు. జార్జి రెడ్డి అందించిన స్ఫూర్తితో నేటి తరం విద్యార్థి నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ప్రగతిశీల ఉద్యమాలు నిర్వహించాలని అన్నారు. జార్జి ఇచ్చిన నినాదం జీనా హైతో మార్నా సీఖో… కదం కదం పర్ లడ్నా సీఖో వేలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసిందని తెలిపారు. జార్జి రెడ్డి విద్య సంస్థల్లో హిందుత్వ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడన్నారు. దేశంలో ఉన్న విద్యాసంస్థల్లో జరుగుతున్న కులవివక్షతకు వ్యతిరేకంగా నేడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ సమానత్వ ప్రోత్సాహ నిబంధనలను అమలు చేయాలని అన్నారు. వికసిత భారత్ అధిష్టాన్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్, దీపాలక్ష్మి, కె.రాణా ప్రతాప్, కె.శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శిలు ఆర్.గౌతమ్ కుమార్, జి.మస్తాన్, మంద నవీన్, గుర్రం అజయ్, కోశాధికారి డి.ప్రణయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల శ్యామ్, కె.ఝాన్సీ, గడ్డం గౌతం, పుల్లూరి సింహాద్రి, ప్రిన్స్, కార్తిక్, మర్రి మహేష్, ఉదయ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page