హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ : ప్రపంచ యోగా దినోత్సవం శనివారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో జరిగింది. యోగా మాస్టర్ వెంకటేష్ చౌదరి తెలుగుదేశం నాయకులతో యోగ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణంలో ఐదు లక్షల మందితో జరిగిన యోగా దినోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ల నాయకత్వ ప్రేరణతో హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లోక సమస్త సుఖినోభవంతు వసుదైక కుటుంబం అనే తత్వం భారతీయ గ్రంథాలు, భారతీయ వాఙ్మయంలో ఉన్నాయని, మనిషి తానొక్కడే బాగుండడమే కాదన్నారు. సర్వ మానవాళి క్షేమం గురించి చెప్పేది కేవలం ఒక సనాతన ధర్మం మాత్రమే ప్రభోధిస్తుందని, యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ యోగా వల్ల మనిషి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. నేటి సమాజంలో నిరంతరం ఒత్తిడితో కుదేలవుతున్న జీవితాలకు యోగ మంచి ఉపశమనమని, ఒక వర ప్రసాదాయిని లాంటిదన్నారు. యోగ మనిషి జీవితంలో ఒక భాగం కావాలని కోరారు. యోగాను ప్రాథమిక దశ నుంచి పాఠ్యాంశంగా చేర్చి రాబోయే తరాల అందరికీ యోగా గురించి సరైన అవగాహన కల్పించాలన్నారు. యోగా శిక్షణ భావితరాలకు అందించడానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో యోగాను ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయాలని డిమాండ్ చేసారు. ఈ యోగా కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎబిఆర్.మోహన్, ఎం.రాజు, భానుప్రకాష్. సిహెచ్.ప్రదీప్ గౌడ్, ప్రసాద్, రామారావు, కాతా విజయ్ కుమార్, జగదీష్ గౌడ్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply