రాష్ట్రంలో హెల్త్ మినిస్ట‌ర్ దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఉన్నారా ? లేరా ? – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా

రాష్ట్రంలో హెల్త్ మినిస్ట‌ర్ దామోద‌ర రాజ‌న‌ర్సింహా ఉన్నారా ? లేరా ?

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఆగ‌స్టు 11, అద్దం న్యూస్ :    ఒకవైపు భారీ వర్షాలతో ప్రజానీకం అస్తవ్యస్తమవుతుంటే, మరోవైపు సీజనల్ వ్యాధులతో రాష్ట్రంలో ప్రజలు అవస్థలు పడుతున్నారని, డెంగ్యూ టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాదులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. కనీసం పర్యవేక్షించే సిబ్బంది కూడా అందుబాటులో లేర‌న్నారు. ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో ఉంటే, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అసలు ఉన్నారా ? లేరా ? అని సాయిబాబా ప్ర‌శ్నించారు. సోమ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ.. డెంగ్యూ మహమ్మారి విజృంబించి మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తుంటే, డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమ‌ర్శించారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధితో గర్భవతి చనిపోయిందని, పుట్టిన బిడ్డ కూడా డెంగ్యూ వ్యాధి సోకడం జరిగిందని.. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాడు లేడన్నారు.                                                                                                                            ఆరోగ్య మంత్రి గాని, సంబంధిత‌ అధికారులు గానీ ఎవరూ లేరని పట్టించుకునే వారు లేక పోవడం చాలా దారుణమైన ప‌రిస్థితులున్నాయ‌న్నారు. 10 ఏళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పట్ల సరైన ప్రాధాన్యత ఇవ్వక పోవడంతో రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కుంటుపడిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎటువంటి మార్పులేక ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యక్ష నరక కూపాలుగా మారాయయ‌న్నారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులలో ఇదే పరిస్థితి కనిపిస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని ఈ పరిస్థితిని పర్యవేక్షించి, సమీక్షించే నాధుడే కరువయ్యాడని, వైద్యం దొరక్క ప్రజలు హలో లక్ష్మణా అంటూ రోధిస్తున్నార‌న్నారు. ముఖ్యమంత్రి స్పందించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సాయిబాబా డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాడు నగరం ఆరోగ్య రాజధానిగా వెలుగొందిందని.. కానీ నేడు నగరం రోగాలకు నిలయంగా మారింద‌న్నారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ప్రజలకు సరైన పాలన అందించలేని, ప్రభుత్వ వైఫల్యం కారణంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆరోగ్యశాఖ దామోద‌ర రాజ‌న‌ర్సింహా, ఇద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజుగౌడ్, ఎస్.ప్రకాష్, తడక వినోద్, కిరణ్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page